![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం నెక్స్ట్ సండే ప్రోమో వచ్చేసింది. పరివార్ అవార్డ్స్ సక్సెస్ పార్టీ పేరుతో ఈ షో రాబోతోంది. ఇక ఇందులో కార్తీక దీపం 2 లో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర లక్ష్మి పరివార్ అవార్డు తీసుకుని వచ్చింది. "ఈ ఇద్దరు అన్నయ్యలకు అవార్డు రాలేదు వాళ్లకు ఏమన్నా చెప్తావా " అంటూ శ్రీముఖి అవినాష్, హరిని చూపిస్తూ చెప్పింది. "ఇప్పటినుంచైనా బాగా చెయ్యండి అన్నయ్యలు. బాగా చేస్తే మీకు కూడా అవార్డ్స్ వస్తాయి " అని చెప్పింది.
" నా మొహమే చూసి చెప్తున్నావ్ ఎం హరికి చెప్పవా " అని అడిగాడు అవినాష్. "వాడికి చెప్పినా వేస్ట్ అని చెప్పలేదు " అంటూ వెనక నుంచి మానస్ కోరస్ ఇచ్చాడు. ఇంతలో ప్రభాకర్ వచ్చాడు. శ్రీముఖి వెంటనే "ఆయన ఉత్తమ నాన్న అవార్డు ఇవ్వడమేంట్రా " అని అడిగింది. "ఉత్తమ నాన్న కాదు ఉత్తమ తాత అంటూ హరి ఇంకొంచెం ఎక్కువ చేసాడు. "మనం ఇంత చిన్న వయసులో అంత నన్నలా యాక్ట్ చేసినందుకు ఇచ్చారు " అని అవార్డు ఇచ్చారు అంటూ ప్రభాకర్ చెప్పేసరికి "ఏ వయసులో " అంటూ అవినాష్ మధ్యలో అడ్డుపడ్డాడు. ఇంతలో బాలు వచ్చాడు. అంతే ఇద్దరూ కలిసి రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ చేశారు. ఇక శ్రీముఖి తెగ సిగ్గుపడిపోతూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాములుగా లేవు. "అవార్డు ఇచ్చినప్పుడు బాగుందా ఇప్పుడు శ్రీముఖిని ఎత్తుకున్నప్పుడు బాగుందా " అంటూ హరి అడిగాడు. "ఓటేసి నన్ను గెలిపించారు కాబట్టి నాకు ఈ అవార్డు గొప్ప " అని బాలు అనేసరికి శ్రీముఖి అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెనకే బాలు వెళ్లి శ్రీముఖి సారీ నేను కొంచెం అలిగి ఉన్నాను అన్నాడు. నువ్వెందుకు అలిగావ్ అని శ్రీముఖి అడిగింది. పాపులర్ జోడి అవార్డు సీరియల్ లో బాలు - మీనాకు వచ్చింది. బాలు - శ్రీముఖికి రాలేదని అందుకే అన్నాడు. అంతే శ్రీముఖి నవ్వేసి బాలుతో స్టేజి మీదకు వచ్చేసింది. "ఇదో తింగరిది ఏది చెప్తే అది నమ్మేస్తది " అంటూ వెనక నుంచి హరి శ్రీముఖిని అనేశాడు.
![]() |
![]() |